భారతదేశం, మార్చి 3 -- Green Hydrogen Plant : తిరుపతిలోని రాక్‌మ్యాన్ ఇండస్ట్రీస్‌లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్‌ను సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్...పారిశ్రామిక అవరసరాల కోసం పీఎన్జీ, ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్‌కు నూతన విధానాన్ని అనుసరిస్తోందని సీఎం అన్నారు. ఈ సాంకేతికత కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని, భారతదేశ శక్తి పరివర్తనకు కొత్త బెంచ్‌మార్క్‌ను అవుతుందన్నారు. తిరుపతిలో ప్రవేశపెట్టబడిన స్కేలబుల్ మోడల్‌ను ఆంధ్రప్రదేశ్‌లోనూ, దేశవ్యాప్తంగా ఇతర పరిశ్రమల్లోనూ అనుకరించవచ్చని చెప్పారు.

స్వర్ణాంధ్ర విజన్-2047 సాధనలో పేర్కొన్నట్టుగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక...