Hyderabad, మే 5 -- Green Dosa: గ్రీన్ దోశ అంటే పెసరట్టు అనుకోకండి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకులతో చేసే దోశ ఇది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. హై బీపీతో బాధపడేవారు, డయాబెటిస్‌తో బాధపడేవారు కూడా ఈ దోశ తినవచ్చు. ఒకసారి దీన్ని చేసుకొని తిని చూడండి. ఇంటిల్లిపాదికి నచ్చుతుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు.

కొత్తిమీర తరుగు - ఒక కప్పు

పుదీనా తరుగు - ఒక కప్పు

కరివేపాకులు తరుగు - అరకప్పు

బియ్యం - ఒక కప్పు

మినప్పప్పు - అర కప్పు

మెంతులు - ఒక స్పూన్

ఉల్లిపాయ - ఒకటి

జీలకర్ర - ఒక స్పూను

పచ్చిమిర్చి - నాలుగు

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - తగినంత

1. బియ్యం, మినప్పప్పు, మెంతులు నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి.

2. తర్వాత వాటిని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

3. ఆ మిశ్రమాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.

4. ఇప్పుడు కొత్తిమీర, ...