భారతదేశం, జనవరి 24 -- 'దానం నాగేందర్'. గ్రేటర్ హైదరాబాద్ లోని ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆయన. కొద్దిరోజులకే కాంగ్రెస్ లో చేరారు. అంతేకాదు. పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి హస్తం పార్టీ అభ్యర్థిగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండగా.. కొద్దిరోజులుగా ఆయనవ్యవహరిస్తున్న తీరు గ్రేటర్ కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది.

దానం నాగేందర్ రాజకీయ ప్రస్థానం కూడా కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉంది. గతంలో ఆ పార్టీ తరపున పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన. మంత్రిగా కూడా పని చేశారు. 2009లో ఎమ్మెల్యేగా గెలిచి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రి అయ్యారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వీ...