Hyderabad, ఫిబ్రవరి 3 -- 67th Annual Grammy Awards 2025 Winners List: సంగీత ప్రపంచంలో పాటల రచయితలు, గాయనీగాయకులు, మ్యూజిక్ ఆల్బమ్స్, అవి నిర్మించే దర్శకనిర్మాతలు వంటి విశేషమైన కృషి చేసిన వారికి గ్రామీ అవార్డులను అందజేస్తారు. తాజాగా 2025కి సంవత్సరానికి గానూ 67వ వార్షిక గ్రామీ అవార్డ్స్ వేడుక అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో అట్టహాసంగా జరిగింది.

ఈ వేడుకల్లో భారత సంతతికి చెందిన అమెరికన్ సింగర్, వ్యాపారవేత్త చంద్రికా టాండన్ (ఇండో-అమెరికన్) అవార్డ్ అందుకున్నారు. చంద్రికా రూపొందించిన 'త్రివేణి' ఆల్బమ్ బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్‌గా పురస్కారం వరించింది. చంద్రికా టాండన్‌కు ఇది రెండో గ్రామీ అవార్డ్ కావడం విశేషం. ఇక గ్రామీ అవార్డ్స్ 2025 విజేతల పూర్తి జాబితాను లైవ్‌లో అప్డేట్‌ చేసినట్లు హెచ్‌టీ ఇంగ్లీష్ వెబ్‌సైట్ పేర్కొంది.

ఉత్తమ ర్యాప...