భారతదేశం, ఫిబ్రవరి 17 -- Grama Ward Sachivalayam : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ ఉద్యోగులను ఏ, బీ, సీ కేటగిరీలుగా రేషనలైజేషన్ చేయాలని నిర్ణయించామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. సోమవారం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలతో మంత్రి సమావేశమయ్యారు. పదోన్నతులు కల్పించాలని, పీఆర్సీ వేయాలని ఉద్యోగులు మంత్రికి వినతులు సమర్పించారు. సచివాలయ ఉద్యోగులను ఎ, బి, సి కేటగిరీలుగా రేషనలైజేషన్ చేయాలని నిర్ణయించామని ఉద్యోగ సంఘాల నేతలకు వివరించామని మంత్రి తెలిపారు.

సీనియర్ అధికారులతో కమిటీని నియమించి సర్వీస్ నిబంధనలు రూపొందిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. రేషనలైజేషన్ విషయంపై అధికారుల కమిటీ పరిశీలన చేస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియతో కొంతమందిని తొలగిస్తారనే ...