భారతదేశం, మార్చి 29 -- ఉగాది పండగ రోజున హుజూర్ నగర్ వేదికగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంతో దేశంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ సన్న బియ్యం పంపిణీ జరగనుంది. కేవలం సన్న బియ్యమే కాకుండా.. త్వరలో ఉప్పు, పప్పు, చింతపండు వంటి సరుకులు కూడా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయనున్నారు. కొత్తగా మరో 30 లక్షల మందిని రేషన్ సరుకులు తీసుకునేందుకు ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది.

సన్న బియ్యం పంపిణీ ద్వారా రాష్ట్రంలో 2 కోట్ల మందికి పైగా ఉన్న తెల్ల రేషన్ కార్డుదారులకు లబ్ది చేకూరనుంది. ఉగాది రోజు సూర్యాపేట జిల్లా మట్టపల్లి ఆలయం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్...