భారతదేశం, ఏప్రిల్ 18 -- EV charging stations on Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను గూగుల్ పొందుపరుస్తోంది. ముఖ్యంగా వాహనదారులకు ఉపయోగపడే అనేక ఫీచర్స్ ను ఇప్పటికే గూగుల్ మ్యాప్స్ (Google Maps) లో పొందుపర్చారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల యజమానులకు మరింత సహాయకారిగా మారే దిశగా మరో ఫీచర్ ను తీసుకువస్తోంది. రహదారులపై ఉన్న ఈవి ఛార్జింగ్ స్టేషన్ల వివరాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా తెలియజేయనుంది. రాబోయే నెలల్లో ఈ ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. గూగుల్ బిల్ట్ ఇన్ సాఫ్ట్ వేర్ తో వచ్చే వాహనాలపై ఈ అప్ డేట్స్ దృష్టి పెడతాయి.

వినియోగదారుల్లో రోజురోజుకీ విద్యుత్ వాహనాలపై ఆసక్తి పెరుగుతోంది. దాంతో, రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే, దూర ప్రయాణాల సమయంలో రహదారులపై ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సమస్య...