భారతదేశం, ఏప్రిల్ 18 -- Google layoffs: టెక్ దిగ్గజం గూగుల్ భారీ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలను ప్రకటించింది. దీని ఫలితంగా కొంతమంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది. గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ కంపెనీ కొత్త ప్రణాళికల గురించి తెలియజేస్తూ ఉద్యోగులకు మెమో పంపించినట్లు సమాచారం.

కృత్రిమ మేథ (AI) తో టెక్నాలజీ రంగంలో సమూల మార్పులు వస్తున్నాయని ఉద్యోగులకు పంపించిన ఆ మెమో లో గూగుల్ (Google) సీఎఫ్ఓ రూత్ పోరాట్ తెలిపారు. ''ఈ మార్పులను ఒక అవకాశంగా తీసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియన్ల మంది మన వినియోగదారులకు మరింత సహాయకరమైన ఉత్పత్తులను, వేగవంతమైన పరిష్కారాలను అందించడానికి ప్రయత్నించాలి. అదే సమయంలో, ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణలో కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది'' అని ఆ మెమో లో వివరించారు.

''కొంతమంది ప్...