భారతదేశం, సెప్టెంబర్ 18 -- అబ్బబ్బా.. కొన్ని రోజులుగా నానో బనానా ట్రెండ్‌ను తెగ ఫాలో అయిపోతున్నారు జనాలు. రోజుకో రకం ప్రాంప్ట్ జెమినీ ఏఐకి ఇస్తున్నారు. ఆపై నచ్చిన విధంగా ఫొటోలు చేసుకుంటున్నారు. ఈ కొత్త టూల్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేసి.. తెగ మురిసిపోతున్నారు. కానీ దాని ద్వారా వచ్చే సమస్యల గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. మన వ్యక్తిగత సమాచారం ఏఐకి ఇచ్చేస్తున్నాం. మన ఫొటోలను అది ఎలా అయినా ఉపయోగించవచ్చు అనే ఆలోచన లేకుండా ఉన్నాం. ఈ నానో బనానా ట్రెండ్‌తో తెలంగాణలో ఓ వ్యక్తి డబ్బులు పొగొట్టుకున్నాడు. సోషల్ మీడియాలో ఒక అమ్మాయి లోపల ఉన్న పుట్టుమచ్చ ఏఐకి ఎలా తెలిసిందని ప్రశ్నించింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన వ్యక్తి జెమినీ నానో బనానా ట్రెండ్ ప్రకారం తన ఫొటోలను త్రీడీలోకి మార్చుకోవాలని అనుకున్నాడు. తెలి...