Hyderabad, మార్చి 1 -- మనలో చాలా మందికి గుడ్ గర్ల్ సిండ్రోమ్ గురించి తెలియదు. కానీ, గమనిస్తే మీ చుట్టూ ఉన్న వాళ్లలో చాలా వరకూ ఈ లక్షణాలున్న వాళ్లే కనిపిస్తారు. ఇది వ్యక్తులను ఆకట్టుకోవాలనే తపన ద్వారా కలిగే ప్రవర్తనకు మూలం. ఈ ప్రవర్తనతో ఉండేవారు ఎల్లప్పుడూ పరిపూర్ణ వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఈ సిండ్రోమ్ మీలోనూ ఉందని అనుకుంటున్నారా.. అయితే ఈ లక్షణాలను గమనించండి.

త్యాగాలకు వెనుకాడకుండా కేవలం మంచి వాళ్లమని గుర్తింపు తెచ్చుకోవడానికి పరితపించే వారు ఇలా ఉంటారు. చాలా విషయాలకు నో చెప్పరు, బలమైన అభిప్రాయాలు ఉండవు, ఇతరులకు ఏది నచ్చితే అది పరవాలేదని సర్దుకుపోతారు. తమలో ఒకరని అనిపించుకునే ప్రయత్నంలో ఎలాంటి త్యాగానికైనా వెనుకాడరు. వాదనలకు దిగకుండా ప్రతి విషయానికి ఏకీభవిస్తుంటారు. ఎల్లప్పుడూ బాగా మాట్లాడాలనే భావనలో బతికేస్తుంటారు. వాస్తవాని...