Hyderabad, మార్చి 27 -- Good friday 2024 date: క్రైస్తవులు జరుపుకునే ముఖ్యమైన పండుగలు మూడు. లోకరక్షకుడు పుట్టిన రోజు క్రిస్మస్, శిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడే, సమాధి నుంచి తిరిగి పునరుత్థానుడిగా వచ్చిన రోజు ఈస్టర్.

యేసుక్రీస్తుని శిలువ వేసిన రోజుగా గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. ఈ ఏడాది గుడ్ ఫ్రైడే మార్చి 28న వచ్చింది. కల్వరి గిరి మీద ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటూ క్రైస్తవులు గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు. అందరూ ఆరోజు చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు. తమ పాపాల నుంచి విముక్తి కలిగించమని వేడుకుంటారు. బైబిల్ ప్రకారం గుడ్ ఫ్రైడే అనేది ఒక విచారకరమైన రోజు కానీ మానవాళిని పాపాల నుంచి రక్షించడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాలను అర్పించిన రోజు. పాపాల నుంచి విముక్తి కలిగించడం కోసం తనని తాను సంతోషంగా త్యాగం చేసుకున్న రోజు. అందుకే ఆ రోజునే మంచి రోజుగా ...