భారతదేశం, ఏప్రిల్ 9 -- తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాపై చాలా హైప్ ఉంది. ఈ సినిమా రేపే (ఏప్రిల్ 10) థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవలే వచ్చిన ట్రైలర్‌తో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ యాక్షన్ కామెడీ మూవీలో అజిత్ మళ్లీ సక్సెస్ ట్రాక్ పడతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. మంచి క్రేజ్ ఉన్న గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి ఓటీటీ డీల్ ఇప్పటికే జరిగింది.

గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఆ ఓటీటీలోనే ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వస్తుంది. నెట్‍ఫ్లిక్స్‌లో ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతుంది. మే నెలలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు ఉ...