భారతదేశం, డిసెంబర్ 1 -- బంగారం, వెండి నవంబర్ నెలను బలమైన లాభాలతో ముగించాయి! పసిడి 5.5% పైగా పెరిగి రికార్డు గరిష్ట స్థాయికి చేరుకోగా, వెండి పసిడిని అధిగమించి ఏకంగా 21.71% భారీ పెరుగుదలను నమోదు చేసింది. ఫలితంగా 2025 సంవత్సరం కమోడిటీ పెట్టుబడిదారులకు అసాధారణ లాభాలను ఇస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బంగారం 65% లాభపడగా, వెండి 100%కి పైగా వృద్ధి చెందింది. మరి ఇప్పుడు గోల్డ్​లో ఇన్వెస్ట్​ చేయొచ్చా? లేక సిల్వర్​ బెటర్​ ఆప్షన్​ అవుతుందా? నిపుణుల సూచనలను ఇక్కడ తెలుసుకోండి.

బలహీనపడుతున్న యూఎస్​ డాలర్, యూఎస్​ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు పెరగడం, డాలర్‌తో పోలిస్తే ఇటీవలే చారిత్రక కనిష్టానికి పడిపోయిన రూపాయి విలువ, వెండికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా సరఫరా కొరత వంటివి ధరల పెరుగుదలను మరింత వేగవంతం చేసింది.

డిసెంబర్ 1, సోమవారం నాడు...