భారతదేశం, ఏప్రిల్ 7 -- Gold Smuggling: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన ఆవసరాల నిమిత్తం సౌదీఅరేబియా నుంచి తెప్పించుకున్న బంగారాన్ని తీసుకొచ్చిన వ్యక్తులే కాజేసిన ఘటన వేములవాడలో వెలుగులోకి వచ్చింది.

వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన రుద్ర రాంప్రసాద్ సౌదీ ఆరేబియాలోని తన సమీప బంధువు రవీందర్ ద్వారా 400 గ్రాముల బంగారం తెప్పించుకునేందుకు అతనికి రూ.30 లక్షలు పంపించాడు.

ఈ క్రమంలో రవీందర్ తన స్నేహితుడు సౌదీలో ఉంటున్న వేములవాడకు చెందిన కాల్వ వెంకటేష్ కు పరిచయస్తులైన చందుర్తి మండలం జోగాపూర్ కు చెందిన తొంటి భీరయ్య, గడ్డం అనిల్ పంపించాడు. ఈ మొత్తం బంగారంను కాజేయాలని కాల్వ వెంకటేశ్, భీరయ్య, అనిల్ పథకం పన్నారు. ఈ విషయాన్ని తమ సమీప బంధువు ఇండియాలో ఉన్న ఏనుగుల నాగరాజుకు...