భారతదేశం, ఏప్రిల్ 24 -- Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు బుధవారం కూడా తగ్గాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1060 దిగొచ్చి.. రూ. 66,600 కి చేరుకుంది. మంగళవారం ఈ ధర రూ. 67,540 గా ఉంది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 10600 తగ్గి, రూ. 6,66,000 కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 6,660 గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 1030 తగ్గి.. రూ 72, 650 కి చేరింది. మంగళవారం ఈ ధర 73,680 గా ఉంది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 10300 దిగొచ్చి.. రూ. 7,26,500 గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,265 గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,750గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,800గా ...