భారతదేశం, ఫిబ్రవరి 3 -- ఆమె చదివింది ఇంటర్. కానీ గ్రామ సర్పంచిగా ఎన్నికయ్యారు. భార్యగా, తల్లిగా సమర్థవంతంగా ఇంట్లో బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె.. ప్రజలకు సేవ చేసే పదవిలోనూ తన ప్రత్యేకత చాటుకున్నారు. అధికారం అప్పగించిన గ్రామస్థుల ఆశల్ని నిజం చేస్తూ.. పంచాయతీని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ స్థాయిలో ప్రత్యేక ప్రతిభాశీలి పురస్కారం అందుకున్నారు. ఆ మహిళ ఎవరో కాదు.. మన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రు సర్పంచ్ జానకీదేవి. ఆమె సారథ్యంలో గొడవర్రు పంచాయతీ ఊహించని విధంగా అభివృద్ధి అయ్యింది.

గ్రామాభివృద్ధి పట్ల జానకీదేవి అంకితభావం, చేసిన కృషి ఫలితంగా జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సహా ఎందరో వీఐపీలు హాజరైన గణతంత్ర వేడుకలకు వెళ్లే అవకాశం వచ్చింది. అంతేనా.. కేంద్ర పంచాయతీ రాజ్ ...