భారతదేశం, మార్చి 3 -- Godavari Pushkaralu: మ‌హా కుంభ‌మేళా త‌ర‌హాలో ఏపీలో 2027లో జ‌రగ‌నున్న‌ గోదావ‌రి పుష్క‌రాలను నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఆ ర‌కంగా ఏర్పాట్ల చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌ప‌డుతోంది. గోదావ‌రి పుష్క‌రాల నిర్వ‌హ‌ణకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు రూ.1,587 కోట్ల ప్ర‌తిపాద‌న‌లను రాష్ట్ర ప్ర‌భుత్వానికి రాజ‌మ‌హేంద్రవ‌రం న‌గ‌ర‌పాల‌క సంస్థ పంపించింది.

2027లో జ‌రిగే గోదావరి పుష్క‌రాల‌ను విజ‌య‌వంతం చేసేందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌పై స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేసేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఇప్ప‌టికే మంత్రులు, ఎంపీలతో పాటు తూర్పుగోదావ‌రి జిల్లా క‌లెక్ట‌ర్ పి. ప్ర‌శాంతి, ఇతర అధికారులు వారి వారి ప‌రిధిలో అనేక స‌మావేశాలు నిర్వ‌హించారు. ఈ స‌మావేశాల్లో గోదావ‌రి పుష్క‌రాల‌కు నిర్వ‌హ‌ణ‌కు చేయాల్సి ప‌నుల‌పై ప్...