Hyderabad, ఫిబ్రవరి 14 -- బిర్యానీ పేరు వింటే తినాలన్న కోరిక రెట్టింపవుతుంది. బిర్యానీలో వెజ్ బిర్యానీ, పనీర్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. కాలి ఫ్లవర్ తో కూడా టేస్టీగా గోబి దమ్ బిర్యానీ వండుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ముఖ్యంగా శాకాహారులకు ఇది ఎంతో నచ్చుతుంది. ఒక చిన్న గోబీ పువ్వుతో దమ్ బిర్యానీ వండేసుకోవచ్చు. ఇక దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

బాస్మతి రైస్ - రెండు కప్పులు

నీరు - నాలుగు కప్పులు

పచ్చి యాలకులు - రెండు

బిర్యానీ ఆకు - ఒకటి

దాల్చినచెక్క ముక్క - ఒకటి

లవంగాలు - రెండు

ఉప్పు - రుచికి సరిపడా

కాలీఫ్లవర్ ముక్కలు - ఒక కప్పు

పెరుగు - ఒక స్పూను

అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు

ఉల్లిపాయలు - రెండు

టమోటాలు - రెండు

పచ్చిమిర్చి - రెండు

పసుపు - అరస్పూను

గరం మసాలా - ఒక స్ప...