భారతదేశం, డిసెంబర్ 7 -- గోవాలోని ఆర్పోరా ప్రాంతంలో ఉన్న ఒక రెస్టారెంట్-కమ్-క్లబ్‌లో శనివరం అర్థరాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 23 మంది మరణించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా విషాదం నింపింది.

అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలు చెలరేగిన వెంటనే అత్యవసర బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు రాత్రంతా శ్రమించారు.

గోవా డీజీపీ అలోక్ కుమార్ ఈ ఘటనపై స్పందిస్తూ... పోలీసులకు అర్ధరాత్రి దాటిన వెంటనే అప్రమత్తత సమాచారం అందిందని తెలిపారు.

"ఆర్పోరాలోని ఒక రెస్టారెంట్-కమ్-క్లబ్‌లో దురదృష్టకర సంఘటన జరిగింది. సరిగ్గా 12.04కు కంట్రోల్ రూమ్‌కి మంటల గురించి సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు, ఫైర్ బ్ర...