భారతదేశం, డిసెంబర్ 7 -- పర్యాటకుల డిసెంబర్​ డెస్టినేషన్​ అయిన గోవాలో అత్యంత ఘోర, విషాదకర సంఘటన చోటుచేసుకుంది! అర్పోరాలోని ఓ రెస్టారెంట్​-కమ్​- నైట్​క్లబ్​లో శనివారం అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 23మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.

మృతి చెందిన 23 మందిలో ముగ్గురు తీవ్రమైన కాలిన గాయాల కారణంగా చనిపోగా, మిగిలిన వారంతా ఊపిరాడక మరణించారు. మృతుల్లో చాలా మంది క్లబ్​కి చెందిన కిచెన్​ స్టాఫ్​ ఉన్నారు. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని, కాగా మరో ముగ్గురు, నలుగురు పర్యాటకులు కూడా ఉన్నారు.

గోవా రాజధాని పణాజీకి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్పోరా గ్రామంలో ఈ క్లబ్ గత ఏడాదే ప్రారంభమైంది. అయితే, శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బిర్చ్ బై రోమియో లేన్ అనే ఈ ప్రముఖ పార్టీ వేదికలో మంటలు చెలరేగాయి.

అగ్నిమాపక సిబ్బంది, ...