భారతదేశం, ఏప్రిల్ 11 -- అమెరికా- చైనాల మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు పెరగడంతో అమెరికా స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​లో పతనమయ్యాయి. ఈ పరిణామాలు ఆసియా మార్కెట్​లపై పడ్డాయి. ఫలితంగా జపాన్​ నిక్కీ సహా అనేక ఆసియా స్టాక్​ మార్కెట్ల​ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా స్టాక్​ మార్కెట్​లో డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1,014.79 పాయింట్లు/ 2.50% క్షీణించి 39,593.66 వద్ద స్థిరపడింది. ఎస్ అండ్ పీ 500 188.85 పాయింట్లు/ 3.46% క్షీణించి 5,268.05 వద్ద ముగిసింది. నాస్​డాక్ కాంపోజిట్ 737.66 పాయింట్లు/ 4.31% క్షీణించి 16,387.31 వద్దకు చేరింది.

డౌ జోన్స్​ ఫ్యూచర్స్​ మరో 500 పాయింట్లు పడ్డాయి.

పలు దేశాలపై విధించిన టారీఫ్​ని 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చేసిన ప...