భారతదేశం, ఏప్రిల్ 12 -- Girlfriend in suitcase: సోనిపట్ లోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీకి చెందిన ఓ విద్యార్థి తన గర్ల్ ఫ్రెండ్ ను పెద్ద సూట్ కేస్ లో దాచి బాలుర హాస్టల్ లోకి అక్రమంగా తీసుకువెళ్లేందుకు యత్నించిన ఘటన సంచలనంగా మారింది. హాస్టల్ లో తోటి విద్యార్థి రికార్డు చేసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్ లైన్ లో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లు, ఎమోజీలతో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. దాంతో పాటు హాస్టల్ ఆంక్షలు, విద్యార్థుల చేష్టలపై చర్చ ప్రారంభమైంది.

నిపట్ లోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీకి చెందిన ఓ విద్యార్థి తన గర్ల్ ఫ్రెండ్ ను తన హాస్టల్ రూమ్ కు తీసుకువెళ్లాలనుకున్నాడు. అందుకు నిబంధనలు అంగీకరించవు కనుక, రహస్యంగా ఆమెను తన రూమ్ కు తీసుకెళ్లాలనుకున్నాడు. ఒక పెద్ద సూట్ కేసులో ఆ యువతిని కుక్కి, జిప్ వేసి హాస్ట...