భారతదేశం, ఏప్రిల్ 11 -- Girl on period: భారతదేశంలో రుతుస్రావం అవుతున్న మహిళల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతోంది. ఈ నెలలో రుతుస్రావం ప్రారంభమైన 8 వ తరగతి బాలికను పరీక్షల సమయంలో తరగతి గది వెలుపల కూర్చోబెట్టారు. తమిళనాడులోని కోయంబత్తూరులోని సెంగుట్టైపాళయం గ్రామంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక (13) పట్ల వివక్ష చూపిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తు కూడా ప్రారంభించారు.

తరగతి గది మెట్లపై కూర్చుని పరీక్ష రాస్తున్న ఆ బాలిక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయింది. రుతుస్రావం అవుతున్న అమ్మాయిలు, మహిళల పట్ల వివక్ష చూపుతున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. దాంతో, ఉన్నతాధికారుల దృష్టి ఈ ఘటనపై పడింది. ఈ వీడియోలో బాలిక తన తరగతి గది వెలుపల మెట్లపై ఒంటరిగా కూర్చ...