Hyderabad, మార్చి 8 -- నేటి సమాజానికి తగ్గట్టుగా మీ ఇంట్లోని ఆడపిల్లలను తయారు చేయాలనుకుంటున్నారా? అయితే యుక్తవయస్సు రాకముందే అంటే చిన్ననాటి నుంచే అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, వారికి ధైర్యాన్ని ఇవ్వడం తప్పనిసరి. ఏది సరైనది, ఏది తప్పు, ఏది అనుకరించకూడదు మొదలైన అనేక విషయాలపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. పెద్దయ్యాక వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం, అవకాశాలను అందించడంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి యుక్తవయస్సుకు చేరుకునే ముందు మీరు బాలికలకు అవగాహన కల్పించాల్సిన విషయాలు ఏమిటి? మీ కూతుర్నీ మీరు ఏ మార్గంలో గైడ్ చేయాలో తెలుసుకోండి.

ఫలితాల కంటే కృషిని అభినందించండి. ప్రతి విషయాన్ని నిర్భయంగా మాట్లాడడానికి, అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి వారిని ప్రోత్సహించండి. వారి ...