Hyderabad, ఏప్రిల్ 3 -- పిల్లలను సరిగ్గా పెంచడం అనేది సవాలుతో కూడుకున్న పని. ఇది చాలా బాధ్యతాయుతమైనది కూడా. ఎందుకంటే పేరెంటింగ్ అనేది సమయంతో పాటు వేగంగా మారుతున్న అంశం. అందుకే తల్లిదండ్రులు కాలానుగుణంగా వారి ప్రవర్తను మార్చుకోవడం, నిరంతరం నేర్చుకోవడం అవసరం. ముఖ్యంగా మీరు ఆడపిల్లకు తల్లిదండ్రులు అయినప్పుడు మరింత జాగ్రత్త అవసరం. కుమార్తెను పెంచుతున్నప్పుడు అమ్మానాన్మలుగా మీ బాధ్యత మరింత పెరుగుతుంది.

నిజానికి అమ్మాయిలు సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. ఏ చిన్న విషయం అయినా వారి హృదయంపై లోతైన ముద్ర వేస్తుంది. అందరూ పిల్లలను చక్కగానే పెంచాలని అనుకుంటారు. కానీ చాలా మంది తల్లిదండ్రులు తెలియకుండానే తమ పెంపకంలో పొరపాట్లు చేస్తుంటారు. వారికి తెలియకుండానే అనేక సార్లు తమ కుమార్తెల మనస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతారు. వారికి మంచి చెప్పబోయి మనసును నొ...