Hyderabad, ఫిబ్రవరి 1 -- కౌమార దశలో చర్మంపై మొటిమలు రావడం సహజమే. కానీ, టీనేజ్ దాటిన తర్వాత కూడా మొటిమల సమస్య వేధిస్తుందంటే కచ్చితంగా ఫోకస్ పెట్టాల్సిందే. ఈ పరిష్కారం కోసం అనేక మార్గాలను ప్రయత్నిస్తుంటాం. మెడిసిన్ వాడుతుంటాం. అలా కాకుండా కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా మొటిమలను నివారించవచ్చట. అంతేకాకుండా క్లియర్ స్కిన్ పొందగలమట. అదెలాగో తెలుసుకుందామా!

కొన్ని శతాబ్దాలుగా అల్లం టీ ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, హార్మోన్ల సమతుల్యతలోననూ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీఆక్సిడెంట్లు పెరుగుతాయట. ఫలితంగా వాపు, బ్యాక్టీరియాలకు పరిష్కారంగా ఉంటుందట. దాంతో మొటిమలు కలిగేందుకు తోడ్పడే బ్యాక్టీరియా నశించి, ప్రకాశవంతమైన చర్మం మీ సొంతమవుతుంది. దీని కోసం అల్లాన్ని షాట్స్ రూపంలో ...