భారతదేశం, డిసెంబర్ 26 -- గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పునర్విభజనకు సంబంధించిన నోటిఫికేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం ఉన్న జోన్లు. రెట్టింపయ్యాయి. ప్రస్తుతం ఉన్న సర్కిల్స్ కూడా 60కి పెరిగాయి.

GHMCని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గతంలో ఉన్న 6 జోన్లను 12 జోన్లుగా.. 30 సర్కిల్స్ ను 60కి పెంచింది. ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ కొత్త జోన్లుగా మారనున్నాయి. సర్కిల్ ఆఫీసులలో కొత్త జోన్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.

తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌లోని 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడంతో పెరిగిన పరిధిని 300 వార్డులుగా ఖరారు చేశారు. ఈ పునర్విభజనకు స...