భారతదేశం, ఫిబ్రవరి 6 -- GHMC DumpingYard: సంగారెడ్డి జిల్లా నల్లవల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్యారానగర్‌లో డంపింగ్‌ యార్డ్ వలన తమ జీవితాలు అస్తవ్యస్థం అవుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేసారు. మంగళవారం అర్ధరాత్రి జిహెచ్‌ఎంసి అధికారులు పెద్ద ఎత్తున వాహనాలతో, చెత్త తీసుకొని వచ్చి అక్కడ డంపింగ్ యార్డ్ పనులు మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న, స్థానికంగా రెండు గ్రామాల నుండి పెద్ద ఎత్త్తున ప్రజలు అక్కడికి చేరుకొని వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

గ్రామస్తులు అడ్డుకోవడంతో అధికారులు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి, రెండు గ్రామాల నుండి JAC గా ఏర్పడింది 45 మంది నాయకులను అదుపులోకి తీసుకొని వేరు వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సంఘటన తో, గ్రామాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ప్రజల ఎలాగైనా అధికారుల ప్రయత్నాన్ని అడ్డుకుంటా...