తెలంగాణ,హైదరాబాద్, జనవరి 30 -- జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది.2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మేయర్‌ విజయలక్ష్మి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.8,440 కోట్ల బడ్జెట్‌కు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. బడ్జెట్ సందర్భంగా.. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఏకపక్షంగా బడ్జెట్ పై చర్చ లేకుండా ఏ విధంగా ఆమోదిస్తారని ప్రశ్నించారు.

కార్పొరేటర్లు ప్లకార్డులతో నిరసన తెలిపారు. మేయర్‌ పోడియాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా యత్నించారు. దీంతో కౌన్సిల్ సమావేశంలో రసాభాస మొదలైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్పొరేటర్లను అరెస్ట్ చేయటానికి ఆ ...