భారతదేశం, మార్చి 7 -- గతంలో ఇంటి నిర్మాణానికి అనుమతి కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అంతేనా.. లోకల్ కార్పోరేటర్ మొదలు.. ఆఫీసర్ల వరకు లంచాలు ఇవ్వందే పర్మిషన్ రాదు. అలాంటి పరిస్థితులకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూర్చున్న చోటు నుంచే ఇంటి నిర్మాణ అనుమతి పొందేలా ఏర్పాట్లు చేస్తోంది. నూతన నిర్మాణ అనుమతుల విధానం బిల్డ్‌ నౌతో ప్రజలకు ఎంతో మేలు జరగనుంది.

సెల్‌ఫోన్ లోనే బిల్డ్‌ నౌ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారులు పరిశీలించి గరిష్ఠంగా 15 రోజుల్లోపు అనుమతి ఇస్తారని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇది కృత్రిమ మేధతో పనిచేస్తుంది. ఇంటి స్థల విస్తీర్ణం 75 గజాల్లోపు ఉంటే దరఖాస్తును సమర్పించగానే అనుమతి వచ్చేస్తుంది. ఈ కొత్త విధానాన్ని మొదట జీహెచ్‌ఎంసీ పరిధిలో మార్చి 10 నుంచి అంద...