తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 9 -- హైదరాబాద్ నగరంలో మీర్ ఆలం చెరువుపై నిర్మించే బ్రిడ్జిని అత్యంత ప్రముఖ ప్రాంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి చుట్టుపక్కల ప్రాంతాలను ఆకర్షణీయంగా మార్చాలని దిశానిర్దేశం చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మీర్ ఆలం చెరువు పై 2.4 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి నిర్మాణం కోసం మూడు ప్రతిపాదనలను అధికారులు వివరించారు.

అధికారుల ప్రతిపాదనలను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పలు సూచనలు చేశారు. 90 రోజుల్లో డీపీఆర్ సిద్ధం చేయడంతో పాటు 30 నెలల్లోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిధిలో కొత్తగా నిర్మించ తలపెట్టిన...