భారతదేశం, మార్చి 29 -- Ghibli-style images: ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన స్టూడియో జీబ్లీ-శైలి పోర్ట్రెయిట్ లను సృష్టించే ట్రెండ్ ఇప్పుడు ఆన్ లైన్ లో పాపులర్ అయింది. అయితే, ఈ ఫీచర్ చాట్ జీపీటీ ప్లస్, చాట్ జీపీటీ ప్రో, చాట్ జీపీటీ టీమ్ వినియోగదారులతో పాటు, ఎంపిక చేసిన సబ్ స్క్రైబర్లకు మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. అధిక డిమాండ్ కారణంగా ఉచిత వినియోగదారులకు ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాలేకపోయామని ఓపెన్ఎఐ సిఇఒ శామ్ ఆల్ట్ మన్ పేర్కొన్నారు.

ఈ ఫీచర్ కు వేరే ప్లాట్ ఫామ్స్ లో ఉచిత ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. జీబ్లీ స్టైల్ ఇమేజ్ ఫీచర్ ను ఉచితంగా కోరుకునే వారు జెమినీ, గ్రాక్ఏఐ, క్రైయాన్, ఆర్ట్ బ్రీడర్ లతో పాటు ఉచిత ట్రయల్స్ అందించే ఇతర ప్లాట్ ఫామ్ లను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా గూగుల్ జెమినీ లేదా ఎలాన్ మస్క్ కు చెందిన గ్రాక...