Hyderabad, మే 8 -- Ghee: చాలామంది వ్యక్తులకు రాత్రిపూట నిద్ర పట్టడం కష్టంగా మారుతుంది. నిద్ర అనేది మెదడుకు, శరీరానికీ విశ్రాంతిని అందించే ప్రక్రియ. కానీ మానసిక గందరగోళాల మధ్య నిద్రపోయే వారి సంఖ్య తక్కువే. అలాంటి వారికి ఒక మ్యాజికల్ పానీయం ఉంది. రాత్రి నిద్ర పోయే ముందు గోరువెచ్చని పాలలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కలుపుకొని తాగండి. ఇలా కొన్ని రోజులు పాటు తాగితే చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. అంతేకాదు గోరువెచ్చని పాలలో నెయ్యి కలపడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కీళ్లు, చర్మం, జీవక్రియ, జీర్ణవ్యవస్థ ఇలా ఎన్నో అవయవాల ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది.

నెయ్యిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. నెయ్యి అంటే వెన్న రూపమే. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అంటే 14 గ్రాములు. ఈ నెయ్యిలో కేలరీలు 112 దాకా ఉంటాయి. కొవ్వు 12 గ్రాములు ఉంటుంది. కొలెస్ట్రాల్ 33 మిల్లీ గ్రాముల...