Hyderabad, మార్చి 28 -- ఉదయం గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభించాలని ఎంతోమంది ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఇది మీ పొట్టను శుభ్రపరుస్తుందని చెబుతారు. అంతేకాదు రోజంతా మీరు తిన్న ఆహారం ద్వారా పేరుకుపోయిన విషాలను, వ్యర్ధాలను బయటకు పంపించేందుకు సహాయపడుతుందని అంటారు. ఈ గోరువెచ్చని నీరు తాగడం వల్ల మీ జీవక్రియ మెరుగవడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని చెబుతారు. అది చాలా వరకు నిజం. అయితే గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను రెట్టింపు చేయాలంటే ఆ నీటిలో ఒక స్పూను నెయ్యిని కలపండి. ఇలా వారం రోజులు పాటు తాగి చూడండి. మీలో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు.

ఖాళీ పొట్టతో నెయ్యి కలిపిన నీరు తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరగడం మొదలవుతుంది. నిల్వచేసిన కొవ్వును కాల్చడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు...