Hyderabad, ఫిబ్రవరి 17 -- శరీరంలో కలిగే అనేక అనారోగ్య సమస్యలకు మూలం మలబద్దకం. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి మీరు చాలా టెక్నిక్స్, మెడిసిన్స్ వినియోగించి ఉంటారు. వాటన్నిటి కంటే సులువైనది, తక్కువ ధరలో అయిపోయేది, అనేక ప్రయోజనాలను అందించేది ఈ నెయ్యి కాఫీ. పేగుల్లో ల్యూబ్రికెంట్ మాదిరిగా మారి మల విసర్జన సాఫీగా జరగడానికి కారణమవుతుంది. అంతేకాకుండా దీనిని రోజు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయట.

కాఫీలో ఒక స్పూన్ నెయ్యి లేదా వెన్న వేసుకోవడాన్ని నెయ్యి కాఫీ అంటారు. ఇలా తాగడం వల్ల నెయ్యిలో ఉండే మృదుత్వం కూడా కాఫీలో కనిపిస్తుంది. అంతేకాకుండా ఫ్లేవర్ మారి అద్భుతమైన సువాసన వెదజల్లుతుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగై, మలబద్దకం సమస్య రాకుండా చేస్తుంది.

నెయ్యిలో బ్యూటిరిక్ యాసిడ్ అధిక మొత్తంలో ఉంటుంది. దీని కారణంగా కాలనాసైట్స్ ఎక్కువగా అంది పేగుల్లో ...