భారతదేశం, మార్చి 9 -- ఈ నెల 16న రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి నియోజకవర్గ అభివృద్ధికి దాదాపు రూ.800 కోట్లతో వివిధ పనులు ప్రతిపాదించగా.. వాటన్నింటికీ సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా శ్రీకారం చుట్టనున్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్ నియోజకవర్గానికి మహర్దశ పట్టనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం చేతులమీదుగా శంకుస్థాపనల అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన స్టేషన్ ఘన్‌పూర్‌లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యే కడియం వివిధ ప్రపోజల్స్ పెట్టారు. ఇందులో ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌లు ఉన్నా...