భారతదేశం, మార్చి 16 -- కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకుని అందరినీ ఉసిగొల్పుతున్నారని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారంలో పోతే బయటికి రాడా.. బయటికి రానప్పుడు మరి ప్రతిపక్ష హోదా ఎందుకు అని ప్రశ్నించారు. హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులకు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. పిల్ల కాకులతో ఎందుకు.. అసలైన వాళ్లనే రమ్మనండి ఛాలెంజ్ చేశారు. ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదమో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.

'అది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కట్టించామని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ ఎవరు కట్టించారో హరీష్ రావు చెప్పాలి. ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే కేసీఆర్ కుటుంబం అప్పులపాలు చేసింది. సింగరేణి, విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టారు. పదేళ్లలో దివాళా తీసిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటన న...