భారతదేశం, నవంబర్ 27 -- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యం గల భారతదేశ మొట్టమొదటి ప్రైవేట్‌ కమర్శియల్ లాంచ్ వెహికల్ విక్రమ్-1ని ఆవిష్కరించారు. స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ. 200,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది నెలకు ఒక ఆర్బిటల్ రాకెట్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంటుంది. అనేక ప్రయోగ వాహనాల ఎండ్-టు-ఎండ్ అభివృద్ధి, ఏకీకరణ, పరీక్ష కోసం దీనిని రూపొందించారు.

క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని మోదీ ప్రసంగించారు. దశాబ్దాలుగా భారతదేశ అంతరిక్ష ప్రయాణానికి శక్తినిచ్చినందుకు ఇస్రోను ప్రశంసించారు. దాని విశ్వసనీయత, సామర్థ్యం, ప్రత్యేకమైన ప్రయోగా...