Hyderabad, ఫిబ్రవరి 1 -- Gemini Suresh About OTT Movie Coffee With A Killer: సంగీత దర్శకుడు, సింగర్ ఆర్‌పి పట్నాయక్ కథ రచనా దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ నిర్మాతగా తెరకెక్కించిన సినిమా కాఫీ విత్ ఏ కిల్లర్. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన కాఫీ విత్ ఏ కిల్లర్ ఆహాలో జనవరి 31 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

టెంపర్ వంశీ, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, రవిబాబు, అంబటి శ్రీను, శ్రీరాప, జెమిని సురేష్ తదితరులు కీలకపాత్ర పోషించిన కాఫీ విత్ ఏ కిల్లర్ ఆహాలో ఓటీటీ రిలీజ్ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నటుడు జెమిని సురేష్ ఇంట్రెస్టింగ్ ఈ విధంగా స్పందించారు.

"అందరికీ నమస్కారం. ఈ చిత్రంలో నటించిన నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ చిత్రంలో కాఫీ షాప్ మేనేజర్ పాత్ర పోషిస్...