Hyderabad, మే 8 -- Geethanjali Malli Vachindi OTT Streaming: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం (మే 7) అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఆహా ఓటీటీలోకి వస్తుందని అందరూ భావించారు. కానీ ఇప్పటి వరకూ మూవీ రాకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. అంజలి నటించిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ఆహానే ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది.

సాధారణంగా ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ మొదలవుతాయి. అలా కాదంటే ప్రత్యేకంగా సదరు ఓటీటీలు ఆ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే సమయం కూడా చెబుతారు. ఈ మధ్య ఆహా ఓటీటీ కూడా ప్రేమలు మూవీ ఉదయం 6 గంటల నుంచి వస్తుందని చెప్పింది. కానీ గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ విషయంలో మాత్రం అలా జరగలేదు.

ఈ సినిమా బుధవారం (మే 8) నుంచి స్ట్రీమింగ్ అవుతుందని రెండు రోజుల కిందట ఆహా...