భారతదేశం, ఫిబ్రవరి 25 -- గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై భూ కబ్జా కేసు నమోదు అయ్యింది. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్‌లో రూ.10 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు న్యాయవాది సతీమణి సుంకర సీతామహాలక్ష్మి పేరిట ఉన్న స్థలం కబ్జా చేసినట్టు ఫిర్యాదు వచ్చింది. ఈ వ్యవహారంలో వల్లభనేని వంశీతో పాటు.. మరో 15 మందిపై హైకోర్టు న్యాయవాది సతీమణి సీతా మహాలక్ష్మి ఫిర్యాదు చేశారు.

ఈనెల 13వ తేదీన వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ రాయదుర్గంలోని మైహోం భుజాలో పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. దాడి, కిడ్నాప్‌, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్‌విత్‌ 3(5) కింద వంశీపై కేసు నమోదు చేశారు. వల్లభనేని వంశీ మరికొన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నార...