భారతదేశం, మార్చి 25 -- Ganja Smuggling: జగిత్యాల జిల్లాలో గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన గోల్కొండ హరీష్, బొల్లెపల్లి అభిషేక్ ఇద్దరు గంజాయి స్మగ్లర్లుగా మారారు. ఒడిశా నుంచి అక్రమంగా గంజాయి తరలించి కోరుట్ల మెట్ పల్లి డివిజన్ పరిధిలో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

యువతను మత్తులో ముంచి గంజాయి దందా సాగిస్తున్నారనే సమాచారం మేరకు నిఘా పెట్టగా మేడిపల్లి శివారులో ఎస్సారెస్పీ కెనాల్ వద్ద ఇద్దరు పట్టుబడ్డారని కోరుట్ల డిఎస్పీ రాములు తెలిపారు. వారి వద్ద నుంచి 2200 గ్రాముల గంజాయి రెండు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.

గంజాయి విక్రయిస్తు పట్టుబడ్డ ఇద్దరు పాత నేరస్థులేనని పోలీసులు తెలిపారు. గతంలో గంజాయి కేసులో పట్టుబడి శిక్ష అనుభవించారని డిఎస్పీ రాములు తెలిపారు. ఒడి...