Hyderabad, ఫిబ్రవరి 21 -- Ganguly Biopic: టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకడైన సౌరవ్ గంగూలీ బయోపిక్ కు హీరో సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని దాదాయే వెల్లడించడం విశేషం. తాజాగా మీడియాతో మాట్లాడిన అతడు.. ఈ బయోపిక్ లో నటించబోయే హీరో, రిలీజ్ డేట్ గురించి వెల్లడించడం విశేషం.

బాలీవుడ్ విలక్షణ నటుడు రాజ్‌కుమార్ రావ్ ఇప్పుడు సౌరవ్ గంగూలీ బయోపిక్ లో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని గంగూలీయే చెప్పాడు. గురువారం (ఫిబ్రవరి 20) మీడియాతో మాట్లాడిన దాదా.. "నేను విన్నంత వరకూ రాజ్ కుమార్ రావ్ ఆ పాత్ర పోషించనున్నాడు.. కానీ తేదీలతోనే సమస్య ఉంది. అందుకే థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో ఏడాదికిపైనే సమయం పట్టవచ్చు" అని గంగూలీ వెల్లడించాడు.

గంగూలీ బయోపిక్ రానుందని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనిపై అతడు కూడా గతంలో చాలాసార్లు స్పందించాడు. తన పాత్రన...