భారతదేశం, ఫిబ్రవరి 14 -- Gangula Kamalakar : కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమగ్ర కుటుంబ సర్వే ముసాయిదాను బహిర్గతం చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. గత 50 సంవత్సరాలుగా మోసం చేసిన కాంగ్రెస్ మరోసారి బీసీలను మోసం చేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్ కాదు...చట్టబద్దతతో కూడిన రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేశారు.

కరీంనగర్ లో బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన గంగుల కమలాకర్ గత 15 ఏళ్ళ జనాభా లెక్కలను ఆధారాలతో చూపించారు. తెలంగాణలో నాలుగు కోట్ల 20 లక్షలకు పైగా జనాభా ఉంటే మూడు కోట్ల 70 లక్షల మంది మాత్రమే ఉన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చూపించిందని, అందులో బీసీలను తగ్గించి కాకి లెక్కలు చెప్పిందని ఆరోపించారు.

జనాభాను తగ్గించడమే కాదు బీసీలను చంపేసిందని వ...