భారతదేశం, ఫిబ్రవరి 11 -- మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం ఏ మాత్రం కూడా అంచనాలను అందుకోలేకపోయింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ పొలిటికల్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. జనవరి 10న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఆరంభం నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకొని చతికిలపడింది. దీంతో నెల తిరగకుండానే ఓటీటీలోకి కూడా వచ్చేంది. ఓటీటీ స్ట్రీమింగ్‍లో గేమ్ ఛేంజర్ మూవీకి వ్యూస్ బాగానే దక్కుతున్నాయి.

గేమ్ ఛేంజర్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ట్రెండింగ్‍లో టాప్‍ ప్లేస్‍కు వచ్చేసింది. ఫిబ్రవరి 7వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. త్వరగానే ఈ మూవీ ట్రెండింగ్‍లో ఫస్ట్ ప్లేస్‍కు వస్తుందని భావించినా అలా జరగలేదు. అయితే, ఎట్టకేలకు మూడు రోజులకు ఈ చిత్రం ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చేసింది. ప్రస్తుతం (ఫిబ్రవరి ...