భారతదేశం, ఫిబ్రవరి 7 -- గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్‍లో సక్సెస్ కాలేకపోయింది. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ ప్లాఫ్‍గా నిలిచింది. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి రేసులో జనవరి 10న ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. మిక్స్డ్ రెస్పాన్ దక్కించుకొని పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది ఈ భారీ బడ్జెట్ చిత్రం. నేడు (ఫిబ్రవరి 7) గేమ్ ఛేంజర్ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

గేమ్ ఛేంజర్ చిత్రం నేడు (ఫిబ్రవరి 7) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ మొదలైంది. అయితే, హిందీ వెర్షన్ రాలేదు. హిందీలో కాస్త ఆలస్యం కానుంది. మొత్తంగా నాలుగు భాషల్లో ఈ గేమ్ ఛేంజర్ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమి...