Hyderabad, ఫిబ్రవరి 4 -- Game Changer OTT Streaming Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు కన్ఫర్మ్ అయింది. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమాను నిర్మించారు. డ్యుయల్ రోల్స్‌లో నటించిన రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్‌గా నటించారు. అలాగే, గేమ్ ఛేంజర్ సినిమాలో వీరితోపాటు ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరామ్, సముద్రఖని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

భారీ అంచనాల మధ్య జనవరి 10న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. సుమారు రూ. 350 నుంచి 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ...