Hyderabad, ఫిబ్రవరి 4 -- Game Changer OTT Streaming Date Confirmed Official: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు కన్ఫర్మ్ అయింది. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.

భారీ అంచనాల మధ్య జనవరి 10న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో గేమ్ ఛేంజర్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూశారు. అలాగే, గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై పలు రూమర్స్ కూడా వినిపించాయి. అయితే, తాజాగా వాటికి చెక్ పెడుతూ గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్.

అమెజాన్ ప్రైమ్‌లో గేమ్ ఛేంజర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 7 నుంచి అమెజాన...