భారతదేశం, ఫిబ్రవరి 5 -- మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' చిత్రం బోలెడు అంచనాలతో వచ్చి.. నిరాశకు గురైంది. సంక్రాంతి సందర్భంగా ఈ ఏడాది జనవరి 10న ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ రిలీజైంది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మొదటి నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్‍లపై తీవ్ర ప్రభావం పడింది. భారీ బడ్జెట్‍తో రూపొందిన గేమ్ ఛేంజర్‌కు బాక్సాఫీస్ వద్ద దెబ్బపడింది. ఈ మూవీ థియేటర్లలో రిలీజైన నెలలోపే ఓటీటీలో అడుగుపెడుతోంది. దీంతో స్ట్రీమింగ్ తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంటుందోననే ఆసక్తి రేగుతోంది.

గేమ్ ఛేంజర్ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో మిశ్రమ స్పందనతో కమర్షియల్‍గా నిరాశపరిచిన ఈ చిత్రం.. ఓటీటీలో సక్సెస్ అవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. గేమ్ ఛేంజర్ చిత...