భారతదేశం, జనవరి 11 -- Game Changer : ఏపీ, తెలంగాణ హైకోర్టుల ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గేమ్ ఛేంజర్ కు షాక్ ఇచ్చాయి. అదనపు షోలు, రేట్ల విషయంలో ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి. తాజాగా గేమ్‌ ఛేంజర్‌ మూవీ టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. టికెట్‌ ధరల పెంపు విషయంలో ఇచ్చిన వెసులుబాటును ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో గేమ్‌ ఛేంజర్‌ టికెట్ ధరలు, అదనపు షోలకు ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించింది. తెలంగాణలో ఇకపై తెల్లవారుజామున స్పెషల్ షోలకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్యం, భద్రత నేపథ్యంలో సినిమాల స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా డైరెక్టర్ శంకర్‌ దర్శక్వతంలో దిల్ రాజు నిర్మిం...